"మంగతాయారు"గా ముమైత్‌ఖాన్
మొన్న 'పోకిరి' చిత్రంలో ఐటం గర్ల్... నిన్మ 'మైసమ్మ ఐపీఎస్'గా కనిపించిన సెక్సీగర్ల్ ముమైత్ ఖాన్ కొత్త సంవత్సరంలో 'మంగతాయారు'గా కనిపించనుంది. 'కబడ్డి కబడ్డీ' ఫేం వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. ముమైత్ ఖాన్ టైటిల్ పాత్రను పోషిస్తోంది. అయితే.. "మంగతాయారు టిఫన్ సెంటర్"లో నటిస్తున్న ముమైత్.. టిఫిన్ సెంటర్ ఎందురు పెట్టింది అనే విషయాన్ని వెండితెరపైనే చూడాల్సిందేనని చిత్ర యూనిట్ అంటోంది.
వెంకి దర్శకత్వంలో పైడిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం లిఖిత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. ఇటీవలే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఎమోషనల్, కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. అందరి సహకారంతో చిత్రాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేశామన్నారు.
అనంతరం దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. 'కబడ్డి కబడ్డీ' చిత్రం తర్వాత పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. జనవరి రెండో వారంలో చిత్రం ఆడియోను విడుదల చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్నారు. ఈ చిత్రంలో జీవా, లక్ష్మీపతితో పాటు.. పలువురు నటీనటులు నటించినట్టు నిర్మాత పైడిబాబు వివరించారు.