1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రాస్తారోకోకు దిగిన బాలకృష్ణ ఫ్యాన్స్..!

రాస్తారోకో  బాలకృష్ణ ఫ్యాన్స్
అసలే హిట్స్ లేని నందమూరి బాలకృష్ణకు మాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని నిరూపించుకున్నారు. లేటెస్ట్‌గా 'ఒక్కమగాడు' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరులో 30 ఫీట్ల బాలకృష్ణ కటౌట్ పెట్టారు.

పెట్టిన మరుసటి రోజు చూస్తే కటౌట్‌కు తలకాయ లేదు. ఇంకేముంది.... ఆవేశంతో ఇది కావాలనే ఎవరో చేశారని రెండున్నర గంటలు రాస్తారోకోకు దిగారు అభిమానులు. ట్రాఫిక్ జామ్.. గందరగోళం.. జరుగుతుందని చుట్టు ప్రక్కల షాప్‌లన్నీ మూసేశారు.

ఇది తెలిసిన పోలీసులు చల్లగా సినిమాల్లో వచ్చినట్లుగా వచ్చారు. ఆఖరికి జిల్లా పోలీసు అధికారి వచ్చిన వారికి హామీ ఇచ్చి బాధ్యులైన వారిని అరెస్టు చేస్తామని చెప్పడంతో ఆగ్రహించిన అభిమానులు శాంతించారు.

ఆ వెంటనే అక్కడే సెంటర్లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఉంది. దానికి పాలతో అభిషేకం చేశారు.. మరి అభిమానం అంటే ఇదేగా... బాలకృష్ణ గారు చూశారు... మీపై అభిమానుల గౌరవం..
About Writer
Hanumantha Reddy