జీవితాశయం నెరవేర్చుకున్న రామానాయుడు
|
ఆల్‌రెడీ ఆయన 100 చిత్రాల నిర్మాతగా గతంలో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు. ఇది రెండో సారి. తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, ఒరియా, అస్సామీ భాషలలో చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా మరాఠీలో చిత్రాన్ని నిర్మించారు.
సురేష్‌ప్రొడక్షన్స్ బేనర్‌లో వీటిని నిర్మించారు. తెలుగులో 'ప్రేమించు' చిత్రాన్ని గతంలో నిర్మించిన రామానాయుడు ప్రస్తుతం మరాఠీలో 'మాజీ ఆయి' చిత్ర టైటిల్ పెరుతో నిర్మించారు. ఈ చిత్రానికి కాంచనాయక్ దర్శకత్వం వహించారు.