సంక్రాంతి చిత్రాల సంతోషంలో త్రిష
నూతన సంవత్సరం.... ప్రత్యేకించి రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్‌లలో సినీ సందడి మొదలైంది. ఈ సందడి సంగతేమోగానీ హీరోయిన్ త్రిష మరింత ఆనందంగా కనబడింది. దీనికి కారణమేంటయా అంటే.... త్రిష నటించిన తెలుగు, తమిళ చిత్రాలు రెండూ సంక్రాంతి సందర్భంగా విడుదలవటమే.
తెలుగులో రవితేజ సరసన 'కృష్ణ' చిత్రంలోనూ... తమిళంలో 'భీమ' చిత్రంలోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు తనకు తప్పకుండా మంచి పేరుతెస్తాయంటోంది త్రిష. నటనతోపాటు మంచి హాస్యాన్ని కూడా అందించే పాత్రలో నటించానని చెపుతోంది ఈ అమ్మడు. సంక్రాంతి పండుగ త్రిషకు విజయాన్ని తెచ్చిపెట్టాలని మనమూ కోరుకుందాం.