మూడేళ్ల తర్వాత మూడు ముళ్లు: తరుణ్
మూడేళ్ల తర్వాతే మూడు ముళ్ల గురించి ఆలోచిస్తానని నటుడు తరుణ్ అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదని, కెరీర్‌పై దృష్టి పడుతున్నానని చెప్పారు. మంగళవారం ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన నవవసంతం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.
రోమియో జూలియట్ కాదు
విజయభాస్కర్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని... దానికి రోమియో జూలియెట్ అనే పేరు పెట్టడం లేదని తరుణ్ స్పష్టం చేశారు. అది తెలుగు టైటిల్ కాదని సమాధానం చెప్పారు. తాజాగా మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
దాసరి నారాయణరావు ఆశీస్సులతో సౌభాగ్యమీడియా బేనర్‌లో రూపొందే చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళంలో ధనుష్ హీరోగా చేసిన పొల్లాదమ్ అనే చిత్ర హక్కులను వాకాడ అప్పారావు తనయుడు వాకాడ అంజన్ కుమార్ పొందారని... దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారుని.. అందులో తాను హీరోగా నటిస్తున్నానని చెప్పారు.
కోకిల నిర్మాత రవి.. ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్నారని.. రమేష్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తరుణ్ చెప్పారు.