రజనీ ''రోబో''లో షారూక్ ఖాన్ కీలక పాత్ర!
భారతదేశ చలన చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో రూపుదిద్దుకోబోతున్న చిత్రం 'రోబో'. తమిళ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. తొలుత షారూక్ ఖాన్ నటించాల్సి ఉండగా.. అనివార్యకారణాల వల్ల ఆయన ఆసక్తి చూపలేదు. అయితే ఈ బాలీవుడ్ హీరో 'రోబో' చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు సమ్మతించినట్టు చెన్నై కోడంబాక్కం వర్గాలు బోగొట్టా.
అంతేకాకుండా హిందీ హాటెస్ట్ తార దీపికా పడుకొనే రజనీకాంత్ సరసన నటించేందుకు ప్రధాన రేస్‌లో ఉంది. ఇప్పటి వరకు పరిశీలించిన హీరోయిన్లలో పదుకొనే అగ్రస్థానంలో ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌ల సరసన నటించి దక్షిణ భారత చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టాలని పదుకొనే కలలు కంటుండంగా.. ఆ కలలు సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.