"సుల్తాన్ ది వారియర్"గా ''శివాజీ''
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపై కొత్త గెటప్‌లో దర్శనమివ్వనున్నారు. అదీ కూడా తన ముద్దుల కుమార్తె సౌందర్య రజనీకాంత్ రూపొందిస్తున్న యానిమేషన్ చిత్రంలో ఈ ఏడాది సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో రూపొందుతున్న 'సుల్తాన్ ది వారియర్' పూర్తిస్థాయి యానిమేషన్ చిత్రం కావడం గమానార్హం. ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబరు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రివ్యూ షోను ఆదివారం చెన్నైలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సౌందర్య చిత్ర వివరాలను వెల్లడించారు. 'సుల్తాన్ ది వారియర్' చిత్రం కమర్షియల్ చిత్రాల తరహాలోనే రొమాంటిక్ పాటలు, ఫైట్లు ఉంటాయని, గత ఏడాదిగా జరుగుతున్న యానిమేషన్ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తవుతుందని వివరించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని పది మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రం యానిమేషన్ పనుల్లో 80 మంది యానిమేటర్లు, టెక్నీషియన్స్, నిపుణులు రాత్రింబవుళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. సాధారణ చిత్రంలాగే ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు సౌందర్య రజనీకాంత్ వివరించారు.