1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సాంప్రదాయానికి విలువిస్తా: అయేషా

సాంప్రదాయానికి విలువిస్తా అయేషా
FileFILE
యువసామ్రాట్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంలో పాల బుగ్గలతో కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టించిన నటీమణి అయేషాటాకియా. ఈ చిత్రం తర్వాత బీజీ అయిన ఈమె బాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలను చేజిక్కించుకుంది.

ప్రస్తుతం ఆయేషా బీబీసీ ఏసియా నెట్‌వర్క్‌లో లవ్ బాలీవుడ్ అనే కార్యక్రమంలో సంయుక్తంగా పాలు పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెను సెక్సీ ఇమేజ్‌పై మీ అభిప్రాయం ఏమిటని అడుగగా... ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది.

అలాగే భారతీయ మహిళకు కూడా కొన్ని సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది.. కాబట్టి వాటిని తాను అనుసరిస్తానని చెప్పింది. తాను అలాంటి (సెక్సీ ఇమేజ్)ను ఆహ్వానించేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. ప్రేక్షకుల కోరిక మేరకు తాను స్కర్ట్స్ వరకు అయితే ఓకేనని అయితే అది కూడా హద్దులు దాటకుండా చూసుకుంటానని తెలిపింది.

సూపర్ చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులకు దూరమైన అయేషా తాను ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా.. అయేషా కాల్‌షీట్ల కోసం దక్షిణాది దర్శక, నిర్మాతలు ఎగబడుతుండటం విశేషం.
About Writer
Hanumantha Reddy