1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నందమూరితో జతకట్టనున్న త్రిష

నందమూరి జతకట్ట త్రిష ఇండస్ట్రీ అగ్రహీరో బాలకృష్ణ కోరిక
FileFILE
చిత్ర సీమలో అగ్రహీరోలందరితో నటించాలని ప్రతి హీరోయిన్‌కు ఉంటుంది. అలాంటి అవకాశాల కోసం హీరోయిన్‌లు ఎదురుచూడడటం సహజం. ఆ కోవలోకే హీరోయిన్‌ త్రిష కూడా వస్తుంది. హిట్ హీరోయిన్‌గా ఫిలిం ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న త్రిష దాదాపు అందరి అగ్రహీరోల సరసన నటించింది.

ఒక్క బాలకృష్ణతో తప్ప... ఈ కోరిక నెరవేరేది ఎలా అని ఎదురుచూస్తున్న త్రిషకు ఆ రోజు రానే వచ్చింది. బాలకృష్ణ హీరోగా నటించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా త్రిష ఎంపికైంది. ఈమె నటించనున్న ఈ చిత్రానికి సాధు అని పేరు పెట్టినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు త్రిష స్టాలిన్ చిత్రం ద్వారా మెగాస్టార్‌తోను.. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రం ద్వారా వెంకటేష్‌తో నటించింది. ప్రస్తుతం నాగార్జునతో రూపొందుతున్న కామాక్షిమూవీస్ చిత్రంలోను నటించబోతోంది. ఇటీవల రవితేజ సరసన నటించిన కృష్ణ చిత్రం కూడా మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

దీంతో హిట్‌హీరోయిన్ అన్ని పేరును త్రిష సార్థకత చేసుకుంది. ఇంక తాజాగా బాలకృష్ణతో నటిస్తున్న సాధు చిత్రం ఏమవుతుందో... చూడాలి. అసలే ప్లాపుల్లో ఉన్న బాలయ్యకు... మరి గోల్డన్ లెగ్ త్రిష చేరికతోనైనా హిట్ కొట్టనున్నాడా.. మరి వేచి చూడాల్సిందే.
About Writer
Hanumantha Reddy