ప్రతిష్టాత్మక చిత్ర దర్శకుని కోసం వేట
|
అయితే అంత గొప్ప నటుడికి కూడా దర్శకుల కొరత ఏర్పడిందంటే.. నమ్మశక్యం కాదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి పనికి వచ్చే కథను పలు అగ్రరచయితలు పరుచూరి బ్రదర్స.. వాళ్ల శిష్యులు కలిసి శ్రమించి ఓ కొలిక్కి తెచ్చారు. ఏనాడో సిద్ధం చేసుకున్న ఈ కథకోసం గతంలో వీవీవినాయక్ దర్శకుడిగా ఎంపికయ్యాడు.
అయితే తాను గుడివాడ నాని చిత్రానికి కమిట్ అయ్యానని.. ఆ చిత్రం పూర్తయిన తర్వాతే చేస్తానని వీవీవినాయక్ చెప్పడంతో కథ మొదటికొచ్చింది. మళ్లీ దర్శకుల కోసం వేట మొదలెట్టారు. రాయలసీమలో పేరెన్నికగన్న స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా.
ఇదిలా ఉండగా.. దీనిపై శ్రీనువైట్లతో పాటు మరో ఇద్దరు దర్శకులను కూడా సంప్రదించారని మరో సమాచారం. ఒకవేళ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆయనకిదే ఆఖరి చిత్రం అవ్వచ్చని... అందుకే ఎంతో జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని.. అది అటో ఇటో అయితే తమ కెరీర్ కష్టాల్లో పడిపోతుందని దర్శకులు సందిగ్ధంలో పడుతున్నారని చిత్ర సీమ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరి కత్తి మీద సాములాంటిదంటే ఎవరైనా కాస్త ఆచి తూచి నడుచుకుంటారు కదా.. అందుకేనేమో.. చిరంజీవితో చివరగా ఓ చిత్రానికి పనిచేసిన తమిళ దర్శకుడు మురగదాస్ ఆ తర్వాత తెలుగులో ఇక దర్శకత్వం వహించనని గతంలోనే స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ముందు జాగ్రత్తనో ఏమో మరి..