1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కోటిరూపాయలిస్తే కాదంటానా: ఛార్మి

కోటిరూపాయలు కాదంటానా ఛార్మి బ్రేక్ అనూహ్యం ఇండస్ట్రీ
FileFILE
చిత్ర సీమలో సరైన బ్రేక్ పాయింట్ లేక పాట్లు పడుతున్న ఛార్మికి మంత్ర చిత్రం అనూహ్యంగా విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. వైవిధ్య నటిగా ఇప్పటికే ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈమె మంత్ర చిత్రంలో కూడా వెరైటీ పాత్రను పోషించింది.

మంత్ర చిత్రం నిర్మాణ దశలో ఉండగా ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ విసుక్కోకుండా తన కాల్‌షీట్‌ను కూడా సవరించి ఇచ్చింది. తీరా విడుదలయ్యాక అనుకున్నదానికంటే మంత్ర భారీ సక్సెస్‌ను సాధించడంతో నిర్మాతలను ఛార్మి మళ్లీ డబ్బులడిగినట్లు సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.

ఈ విషయంపై ఛార్మిని కదిలిస్తే.. అలాంటిదేమీ లేదని ఖచ్చితంగా చెప్పేసింది. అయితే ప్రస్తుతం ఇలియానా కోటి రూపాయలు తీసుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి మీరు కూడా అంత రెమెన్యురేషన్ అడుగనున్నారా అంటే.. వాళ్లు ఇస్తే కాదంటానా... అంటూ తెలివిగా సమాధానం చెప్పి దాటేస్తోంది.

ఏదీఏమైనప్పటికీ తనకు హిట్ చిత్రాలతో పాటు మంచి రెమెన్యురేషన్ కూడా కోరుకుంటున్నట్లు ఆశగా చెబుతోంది. అయితే హిట్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్న ఛార్మికి 2007 చివరలో మంత్ర చిత్రం ద్వారా మంచి బ్రేక్ పాయింట్ వచ్చిందని చెప్పవచ్చు. దీంతో ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా రానున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు పేర్కొన్నాయి.
About Writer
Hanumantha Reddy