అసభ్య వస్త్రధారణపై క్షమాపణ చెప్పిన శ్రియ
|
ఇదిలా ఉండగా శివాజీ చిత్రం 175 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నైలో జనవరి 11న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే చిత్ర కథానాయిక శ్రియ అరకొర వస్త్రాలను ధరించి పైన పేర్కొన్న కార్యక్రమంలో పాల్గొనడం సభికులను, అదేసమయంలో వేదికపైన కొలువైన ప్రముఖులను నివ్వెరపరిచింది.
ఇదిలా ఉండగా హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు భంగం వాటిల్లేలా శ్రియ వస్త్రధారణ చేసినందున, ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎమ్‌కే) చెన్నై జిల్లా అధ్యక్షుడు రామమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరువును కాపాడుకునే క్రమంలో మీడియా ముందుకు వచ్చిన శ్రియ, మనోభావాలకు భంగం కలిగించినందుకు గాను తనను క్షమించవలసిందిగా తమిళ ప్రజలను, రాష్ట్రంలోని హిందువులను కోరింది.
తన తప్పును అంగీకరించిన శ్రియ, భవిష్యత్తులో హిందువులు, తమిళుల మనోభావాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని పేర్కొంది. తమిళనాడు సంస్కృతీసంప్రాదాయలపై తనకు ఎనలేని గౌరవమర్యాదలు ఉన్నట్లు వెల్లడించింది. కార్యక్రమంలో తన వస్త్రధారణ ద్వారా ఇటువంటి స్పందన వస్తుందని తాను ఊహించలేదని కోలీవుడ్ హాట్ హీరోయిన్ శ్రియ తెలిపింది. తంజావూరులోని ఒక హిందీ సినిమా షూటింగ్‌లో ఉన్న తనకు శివాజీ ఫంక్షన్ గురించి తెలిసిందని, దాంతో ఫంక్షన్‌కు సకాలంలో చేరుకోవాలనే ఆదుర్దాలో షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఫంక్షన్‌కు వచ్చినట్లు ఆమె వివరించింది.