1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శివాజీ-వైజయంతీల "సూపర్" కాంబినేషన్

తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్‌ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు
FileFILE
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో మెగా ప్రొడ్యూసర్‌ చలసాని అశ్వనీదత్. అలాగే తమిళంలో సూపర్‌స్టార్‌గా నీరజనాలు అందుకుంటున్న హీరో రజనీకాంత్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో తొలి సారిగా కొత్త చిత్రం రానుంది. ఈ చిత్రానికి 'చంద్రముఖి' దర్శకుడు పి.వాసు. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమా కథకు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కథ పరయుమ్' అనే చిత్రం మాతృక.

దీనిపై నిర్మాత సి.అశ్వనీదత్ చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీరామారావు చేతుల మీదుగా ప్రారంభమైన తమ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎన్నో చిత్రాలను నిర్మించమన్నారు. గత 33 ఏళ్లలో 55 చిత్రాలను అందించిన ఘనత తమ సంస్థకు దక్కింది. అయితే రజనీకాంత్‌తో ఓ చిత్రాన్ని తీయాలనే కోరిక ఎప్పటి నుంచే ఉంది.

అది నేటికి ఫలించనుంది. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్‌తో చిత్రం తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'కథ పరయుమ్' అనే చిత్ర కథను ఆధారంగా చేసుకుని సెవెన్ ఆర్ట్స్ జిపి.విజయకుమార్‌తో కలసి తెలుగులోకి రిమేక్ చేస్తున్నాం. ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా ప్రైమ్ స్టార్ జగతిబాబుతో పాటు.. హాస్యనటుడు బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, తనికెళ్ల భరణి వంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారని వివరించారు.

అనంతరం దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ... ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించే ఈ చిత్రాన్ని రజనీకాంత్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మలయాళ కథను తీసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌తో పాటు.. మలయాళ నటుడు శ్రీనివాసన్, సెవెన్ ఆర్ట్స్ అధినేత విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
PNR