1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రభుదేవా నాకు స్ఫూర్తి: అల్లుఅర్జున్

ప్రభుదేవా స్ఫూర్తి అల్లుఅర్జున్ గంగోత్రి ఆర్య
FileFILE
గంగోత్రి చిత్రంలో ఏమీ తెలీనివాడిలా నటించి.. ఆర్య, హ్యాపీ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అల్లుఅర్జున్. వైవిధ్యనటనతో ఎంతో మంది అభిమానుల ఆధరాభిమానాలను పొందాడు. చిత్రచిత్రానికి ఎదుగుతూ చిత్ర సీమలో తన కంటూ ఓ స్టార్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడీ హీరో.

ఎవరైనా.. ఏ రంగంలోనైనా రాణించాలంటే టాలెంట్ ఎంతో ముఖ్యమని తాను విశ్వసిస్తానని అంటున్న ఈ హీరో డ్యాన్స్‌లో ప్రేరణ, స్ఫూర్తి ప్రభుదేవా అని చెబుతున్నాడు. స్టార్‌డమ్ రావాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే టాలెంటు కావాలని అంటున్నాడు.

చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయంటే అది టాలెంట్ ఆధారంగానే జరుగుతుందని చెప్పాడు. తాను ఏదో ఒక రోజు స్టార్‌డమ్ కాగలనని... దీమాగా వ్యాఖ్యానించాడు. అయితే దాని కంటే ముందు తాను సాధించాల్సింది చాలా ఉందని.. ఎన్నో మైళ్లను అధికమించాల్సి ఉందని వినమ్రంగా చెబుతున్నాడీ యువహీరో.

ప్రస్తుతం ఓ కొత్త చిత్రంలో ఈ మధ్యే గోదావరి తీరం దగ్గర షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు అల్లు అర్జున్.
About Writer
Hanumantha Reddy