రెండో ఆసియా అవార్డు రేసులో పదుకునే
'ఓం శాంతి ఓం' చిత్రంతో కుర్రకారు హృదయాలలో గుబులు రేపిన బాలీవుడ్ అందాలరాణి దీపికా పదుకునే. షారుఖ్‌తో హొయలుపోతూ నటించిన ఈ బ్యూటీ రెండో ఆసియా ఫిలిమ్ అవార్డు రేసులో ఉత్తమ నటీమణి విభాగంలో పోటీపడనుంది.
తన అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులనే కాక యావద్భారత సినీ ప్రేమికులను ఆకట్టుకున్న పదుకునే... చైనా, దక్షిణ కొరియా, కొరియా, హాంగ్ కాంగ్ దేశాలలోని నటీమణులతో పోటీపడి ఈ ప్రసిద్ధ అవార్డును గెలుచుకోవాల్సి ఉంది. ఒకే ఒక్క చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఈ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందేమో చూద్దాం.