కమల్ ''మర్మయోగి'' కోసం రూ. 120 కోట్లు
Publish: Mon, 21 Jan 2008 (12:36 IST)
Updated: Mon, 21 Jan 2008 (12:35 IST)
వైవిధ్య నటుడు కమల్ హాసన్ త్వరలో మర్మయోగి టైటిల్‌తో వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు వెల్లడించాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు భోగట్టా. కమల్ "మర్మయోగి" చిత్రానికి రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా కమల్ చేపట్టనున్నట్లు తెలిసింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త హీరోయిన్ ఎంపిక కోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నట్లు కోలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి.కాగా, ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ హీరోగా రూపొందనున్న రోబోట్ కూడా భారీ బడ్జెట్ కావటం, ఇదే సమయంలో కమల్ తన చిత్రం కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టనుండటం గమనార్హం.
About Writer
Hanumantha Reddy