నిర్దేశించడాన్ని ఇష్టపడను: రవితేజ
|
చిత్ర విజయోత్సవ ఆనందంలో హీరో రవితేజ మాట్లాడుతూ... చిత్రం విజయానికి మూల కారకులు దర్శకుడు, వీవీవినాయక్ అని తెలిపారు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తిగా మలిచారని, చిత్ర యూనిట్ కూడా బాగా శ్రమించిందన్నారు.
కథానాయిక ఎంపిక విషయంలోగానీ, లేదంటే చిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలోగానీ తాను ఎవరినీ నిర్ధేశించనని తెలిపారు. అయితే వారికి తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడిస్తానని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన రవితేజ.. దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడతానని తెలియజేశారు. అయితే తాను దర్శకత్వం వహించే చిత్రంలో తానే నటించబోనని చెప్పాడు.