చిరు పార్టీ కోసం ఎన్ఆర్ఐల ఎదురుచూపు
|
రాష్ట్రరాజకీయాల్లోకి చిరంజీవి ప్రవేశం అవినీతిని దూరం చేయగలదని విశ్వసిస్తున్న అభిమానుల్లో తాజాగా ప్రవాసాంధ్రులు (ఎన్ఆర్ఐ)లు కూడా చేరిపోయారు. ఆయన వస్తే రాష్ట్ర భవిష్యత్ మారిపోతుందని ఆకాంక్షిస్తున్న అభిమానులు.. ప్రోగ్రెసివ్ తెలుగు ఫోరం పేరుతో త్వరలో ఒకటి కానున్నారు.
అంతేకాక అమెరికా వంటి ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు మెగాస్టార్ పార్టీ పెట్టాలని కోరుతూ ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లో సంతకాలతో ఓ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు(www.chiruforap.com). చిరంజీవి రాజకీయ ప్రవేశంపై ఈ వెబ్‌సైట్ ద్వారా తమ అభిప్రాయాలను కూడా వెల్లడించవచ్చు. దీనికి వారు చేంజ్ అండ్ హోప్ విత్ చిరంజీవి అన్న నినాదాన్ని కూడా కలిపారు.