1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శ్రీహరి ప్రధాన పాత్రలో సెవెన్ చిత్రం

ఎ వెంకట్‌ప్రభు టి శివ శ్రీహరి పోలీసు అధికారి అమ్మాక్రియేషన్స్ సంస్థ
WD PhotoWD
ఎ. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న సెవెన్ చిత్రం టి. శివ నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించనున్నారు. తమిళరంగంలో వివిధ చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్ సంస్థ తొలి సారి తెలుగులో ఈ చిత్రం ద్వారా ప్రవేశిస్తోంది. తమిళ చిత్రం సరోజ అనే చిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీహరి పోలీసు అధికారిగా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేటు భవంతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఏడు అంకెకు ఈ కథలో లింక్ అయి ఉండడంతో సెవెన్ అనే టైటిల్ పెట్టినట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో తను ఓ వైవిధ్య పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు పేర్కొన్నాడు.

అనంతరం దర్శకుడు మాట్లాడుతూ స్నేహం, ప్రేమ, థ్రిల్ వంటి అంశాలతో పాటు మానవీయ అంశాలను కూడా కథకు జోడించామన్నారు. ఐదుపాటలున్న ఈ చిత్రం హైదరాబాద్‌ టు చెన్నై మధ్య కథ సాగుతుందని పేర్కొన్నారు. తాను తమిళంలో చెన్నై-28 చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు.

కాగా, ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, కెమెరా శక్తి శరవణన్ షూట్ చేస్తున్నారు.
About Writer
Hanumantha Reddy