పాటల చిత్రీకరణలో జంక్షన్ చిత్రం
|
చంద్రబోస్ రచించిన నచ్చావు నచ్చావురా.. అనే పాటని రవిబాబు, ఆశాషైనీ (మయూరి)లపై శంకర్ దర్శకత్వంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఇటీవల చిత్రీకరించారు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా కథనే నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, పరుచూరి మార్కు డైలాగులు ఆదనపు ఆకర్షణ అవుతాయని నిర్మాతలు తెలిపారు.
పార్ములా కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని, తమ దగ్గర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన తమ శిష్యుడు ప్రేమ్‌రాజ్ దర్శకుడిగా కూడా ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తాడని నమ్ముతున్నట్లు పరుచూరి బ్రదర్స పేర్కొన్నారు. కేరళకు చెందిన దాల్మా నూతన హీరోయిన్‌గాపరిచయమవుతోందని దర్శకుడు చెప్పారు.