తల్లిదండ్రులకే ఈ చిత్రం అంకితం: బాపు బొమ్మ
|
గిన్నీస్ బుక్ రికార్డు నిర్మాత డి.రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రం ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. బాపు సినిమా అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత చిత్ర పోస్టర్లు చూస్తూనే తెలుస్తుంది. సంగీతపరంగా మంచి హిట్ సాధిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. యువ దర్శకుడు వివి.వినాయక్ మాట్లాడుతూ.. చిత్రం ఆడియో ఆవిష్కరణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన నరేష్, ఛార్మీలు జీవితాంతం దాచుకోదగిన స్టిల్స్ ఈ చిత్రం ద్వారా లభిస్తాయన్నారు.
నటుడు నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం నా అదృష్టం. "కితకితలు" సినిమా చూసిన బాపుగారు నన్ను ఎంపిక చేసుకున్నారు. తాను ఎన్నో సినిమాలు చేశానని, అయితే ఈ చిత్ర షూటింగ్‌లోనే తొలిసారి స్టోరీ బోర్డ్ చూడటం ఆశ్చర్యమేసిందన్నారు. ఈ కార్యక్రంలో పాల్గొన్న కొండవలస, వైజాగా ప్రసాద్, లక్ష్మీపతి, తదితరులు మాట్లాడుతూ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'సుందరకాండ' చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైంది.