దాడి వెనక ఠాగూర్ రీ''మేకు''?!
|
ఇక సినిమాపరంగా చెప్పాలంటే... రాజశేఖర్ ఎక్కువగా మలయాళం, తమిళ చిత్రాల రైట్స్ కొని ఆయనే రీమేక్ చేస్తుంటారు. ఆ క్రమంలో తమిళంలో విజయకాంత్ నటించగా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న 'రమణ' చిత్రం (తెలుగులో 'ఠాగూర్') రీమేక్ హక్కులు రాజశేఖర్ పొందారు. కానీ ఆ సినిమా నిర్మాణానికి ఆలస్యం చేయడంతో... ఆయన దగ్గర పని చేసే ఓ కోడైరక్టర్... మంచి కథ ఉందని చిరంజీవికి తెలిసేలా ప్రవర్తించాడని అప్పట్లో టాలీవుడ్ కోడై కూసినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా.
దీంతో వెంటనే ఆ కథను వేరే మార్గం ద్వారా దక్కించుకుని వినాయక్‌తో చిరంజీవి ఠాగూర్ చిత్రం చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఠాగూర్ చిత్రం బాగానే ఆడిన నేపథ్యంలో రాజశేఖర్‌కు చిరంజీవి పట్ల దురభిప్రాయం ఏర్పడిందని విశ్వసనీయ వర్గాల పేర్కొన్నాయి. కానీ మెగాస్టార్‌ను ఏమి చేయలేని పరిస్థితిలో రాజశేఖర్ ఉండిపోయారని తెలిపాయి. కథను లీక్ చేసిన కోడైరక్టర్‌ను రాజశేఖర్ దేహశుద్ధి చేసారని టాలీవుడ్ గుసగుసలు పోయింది.
ఈ సంగతి ఇలా ఉంటే... సోమవారం ఉదయం జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న రాజశేఖర్ కారుపై కొందరు వ్యక్తులు సినీఫక్కీలో వెంబడించారని ప్రత్యక్ష సాక్షుల కథనం. దాడిని పసిగట్టిన రాజశేఖర్ కారు వేగాన్ని పెంచినప్పటికీ, నిరంతరం రద్దీగా ఉండే పంజాగుట్ట వద్ద ఆయన కారు వేగానికి బ్రేకు పడిందని తెలిసింది. అంతే... మెగాదాడి మొదలైంది. కారు అద్దాలు బద్దలయ్యాయి.
అదండీ... మాటలు తెచ్చిన తిప్పలు...