విలన్ పాత్రలో చేయాలనుంది: జగపతిబాబు
|
హైదరాబాద్‌లో జగపతిబాబు మాట్లాడుతూ తాను నటుడినని కనుక పాత్ర ప్రాముఖ్యతను బట్టి ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధమేనని తెలిపాడు. చిన్న పాత్రైనా చేసేందుకు తనకేమీ అభ్యంతరం లేదంటున్న జగపతి బాబు ఇటీవల హీరోగా నటించిన స్వాగతం చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి.
మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ చిత్రంలో జగపతి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో రజినీ సోదరుడిగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడని.. ఈ చిత్రం ఘనవిజయం సాధించగలదని జగపతి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సినీవర్గాల భోగట్టా. అంతేకాదండోయ్ రజినీయే స్వయంగా జగపతి పేరును ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం.