1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అర్థనగ్నం... ఇదేనా సక్సెస్ సూత్రం...?

కురచ దుస్తులు సెక్సీతార శ్రియ నమిత కథానాయిక బాలీవుడ్
ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో చర్చించిన అంశాలలో ప్రజాసమస్యలే కాదు... కోలీవుడ్ కథానాయికల వస్త్రధారణ కూడా చేరింది. సోమవారం నాటి తమిళనాడు శాసనసభ సమావేశంలో కోలీవుడ్ శృంగార కథానాయికలైన శ్రియ, నమితల వస్త్రధారణపై వేడివేడి చర్చసాగింది. హీరోయిన్ల వ్యవహార శైలితో రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని పీఎమ్‌కే శాసనసభ్యుడు టీ వేలుమురుగన్ ధ్వజమెత్తితే... పాలక పక్ష సీనియర్ నేత మంత్రి ఎన్ వీరాస్వామి కథానాయికల వైఖరిని సమర్థించేశారు.

కురచ దుస్తులు, నాభీ భాగం కనపడేటట్లు సెక్సీ నృత్యాలు... వీపు భాగం కనబడేటట్లు మోకాళ్లపైదాకా దుస్తులను ధరించి కవ్వింపు సన్నివేశాలలో నటించి... ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం బాలీవుడ్ నుంచే మొదలైందని చెప్పాలి. అసలు బాలీవుడ్ తార అంటే... అర్థనగ్నంగా కనిపిస్తూ సెక్సీ నృత్యాలను చేస్తుందన్న ముద్ర పడింది. ఒకప్పుడు ఇలాంటి దుస్తులలో కనిపించేందుకు ప్రత్యేకించి శృంగార తారలు ఉండేవారు. ప్రస్తుతం వారి పాత్రలను కూడా కథానాయికలే పోషిస్తున్నారని ఇటువంటి పాత్రలకే పరిమితమైన ఓ శృంగారతార ఆరోపణ.
అర్థనగ్నం 'సినీ' సంప్రదాయమా...?
  శృంగార వస్త్ర ధారణ అనేది కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేసింది. సినీ ఉత్సవాలు ప్రారంభమైతే చాలు... అక్కడకు వెండితెరపై ధరించే సెక్సీ డ్రెస్సులను మించిన దుస్తులలో నాయికలు దర్శనమిస్తున్నారు.      


శృతిమించిన ఎక్స్‌పోజింగ్‌కు అవకాశం గల పాత్రలలో నంటించే తారలను... ఇటువంటి సన్నివేశాలలో నటించేందుకు ఎందుకు అంగీకరించారు అని అడిగితే... వారు చెప్పే మాట.... పాత్రకు అనుగుణంగా తాము చేయాల్సి ఉంటుందనీ, అసలు ఇటువంటి దుస్తులను మించిన మోడ్రన్ దుస్తులను కాలేజీ అమ్మాయిలు ధరిస్తున్నారని చెపుతుంటారు. అప్పటికలా సర్దిచెప్పుకోవటం మామూలైంది కూడా.

శృంగార వస్త్ర ధారణ అనేది కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేసింది. సినీ ఉత్సవాలు ప్రారంభమైతే చాలు... అక్కడకు వెండితెరపై ధరించే సెక్సీ డ్రెస్సులను మించిన దుస్తులలో నాయికలు దర్శనమిస్తున్నారు. అటువంటి దుస్తులలో వారిని చూసిన ప్రజలు తారలపై ఎగబడిన సంఘటనలు కోకొల్లలు. కోలీవుడ్‌లో అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్న పలువురు సెక్సీతారలపై ఇటువంటి తోపులాటలు జరిగాయి.


ఇక బాలీవుడ్ సంగతి సరేసరి... సెక్సీ డ్రెస్సులను ధరించని వారికి... ఎక్స్‌పోజింగ్ చేయనివారికి స్థానం లేదు. అర్థనగ్నంగా కనిపిస్తేనే అవకాశం... లేదంటే కనుమరుగే... అన్న అభిప్రాయం నెలకొంది. కేవలం నటనతో ప్రేక్షకుల మదిని ఆకట్టుకోవాలనుకునే తారలు దాదాపు లేరని చెప్పాల్సిన పరిస్థితి. మొత్తం మీద 'శృంగార కథానాయిక' అన్న బ్రాండుకోసం పాకులాడే తారలు ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు... కోలీవుడ్.. టాలీవుడ్... ఇలా అన్ని సినీ పరిశ్రమలలోనూ ఉన్నట్లు నేటి సినిమాలు చెబుతున్నాయి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT