జంక్షన్ జామైంది..!
|
ఇటీవలే తొలి షెడ్యూల్ ప్రారంభించి రవిబాబు, ఆశాషైనీ ఓ పాటను సైతం చిత్రీకరించారు. కాని ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో సినిమా అటకెక్కినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో.. హతవిధీ.. ఇలా జరిగిందేంటనే.. నిర్ణయానికి దర్శక, నిర్మాతలు వచ్చారు.
వారిలో ఓ నిర్మాత బయటకు వచ్చేశాడు. ఎక్కడ లోపమని విశ్లేషిస్తే.. అసలు లోపం కథానాయకుడిలో ఉందని తెలుస్తోంది. తను హీరో అనే విషయాన్ని మరిచిపోయి... కథలో మార్పులు, మ్యూజిక్‌లో మార్పులతో పాటు అనుకున్న సమయానికి షాట్‌లోకి రాకపోవడంతో ఆదిలోనే అయ్యగారు ఆర్భాటం చూపిస్తున్నారంటూ యూనిట్‌లో గుసగుసలు మొదలయ్యాయి.
ఈ సినిమాకు ముందు ఆవారాగా తిరిగే వాడని, కాస్త కుదుటపడతాడని అనుకుంటే తమ పరువు తీస్తున్నాడని మరోవైపు అగ్రరచయితలు ఆలోచనలో పడ్డట్టు భోగట్టా. ఇదిలా ఉంటే... జంక్షన్ సినిమా సంగతి తర్వాత చూద్దాం... మరో కథ రెడీగా ఉంది. దీన్ని షూట్ చేద్దామనేసరికి నిర్మాతకు నిజంగానే చిర్రెత్తింది.
మరి డబ్బులు పెట్టేవాడికే కదా ఆ బాధేంటో తెలుస్తుంది. ఏది ఏమైనా ఆదిలోనే ఇలా చూపిస్తే ఎలా రవి... పండితుల బిడ్డగా కాస్త పేరు నిలబెట్టడానికి ప్రయత్నించుకోమని సన్నిహితులు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.