1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రవితేజ, అనుష్కల కొత్త చిత్రం

రవితేజ యూత్‌ఫుల్ సురేష్‌ప్రొడక్షన్స్ ఉదయ్‌శంకర్ కేఎం రాధాకృష్ణణ్
FileFILE
యూత్‌ఫుల్, మాస్ ఎంటర్‌టైనమెంట్ చిత్రాల్లో హీరోగా ప్రేక్షకుల ఆదరణను పొందిన నటుడు రవితేజ హీరోగా..కొత్త చిత్రం రూపొందనుంది. అగ్రనటుల సరసన కథానాయికగా నటించి తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులుపుట్టిస్తున్న నటీమణి అనుష్క ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది.

సురేష్‌ప్రొడక్షన్స్ బేనరుపై ఉదయ్‌శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కేఎం రాధాకృష్ణణ్ అందిస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అంతేకాక తొలి షెడ్యూల్ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరించాలని అనుకుంటున్నట్లు భోగట్టా.

కాగా, రవితేజ నటించిన కృష్ణ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌ బాటలో నడుస్తుండటంతో తన పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా ఫ్రెండ్స్‌ని పిలిపించుకుని మరీ ఎంజాయ్ చేశాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు అనుష్క నటించిన ఒక్కమగాడు చిత్రం ఫట్‌మనిపించడంతో ఈ చిత్రంపై ఆమె ఆశలు పెంచుకున్నట్లు టాక్.

అయితే వీరిద్దరు గతంలో నటించిన విక్రమార్కుడు చిత్రం విజయవంతం అయింది. మళ్లీ ఈ జంట మరో సారి హిట్‌ఫెయిర్ అవుతుందేమో చూద్దాం..!
About Writer
Hanumantha Reddy