నా అంచనాలను మించిపోయాడు: మెగాస్టార్
ఊహించని విధంగా "చిరుత"లో రామ్ చరణ్ తేజ అద్భుతమైన నటన విన్యాసాన్ని ప్రదర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని 'మెగాస్టార్' చిరంజీవి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తన అంచనాలను ఏ దశలోను వమ్ము చేయకుండా నటించాడని చిరు పేర్కొన్నారు. 'చిరుత' వంద రోజలు శతదినోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ ప్రసంగిస్తూ.. తొలుత దర్శకరత్న దాసరిగారు మాట్లాడుతూ.. తొలి చిత్రంలోనే చరణ్ బాగా చేశాడని కితాబిచ్చారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇపుడు చరణ్‌కు చిరంజీవి వున్నాడు. కానీ అప్పట్లో నాకు అండగా నిలిచేందుకు నాకు ఏ చిరంజీవి లేడు.
తొలి చిత్రానికే దాసరిగారి అభినందనలు అందుకోవడం చాలా సంతోషంగా వుంది. చరణ్‌కు సలహాలు ఇచ్చేందుకు తొలి కాపీ చూశాను. కానీ చిత్రం మొదలైన కాసేపటికే చిత్రంలో పూర్తిగా లీనమైపోయాను. కొత్త హీరోలా చేయలేదు. ఇక పూరీ, అశ్వనీదత్ నా నమ్మకాన్ని నిజం చేశారు. ఏ హీరోకైనా తొలి సినిమా హిట్టై షీల్డు అందుకోవడం తీయని అనుభూతిని మిగుల్చుతుంది. "మనవూరి పాండవులు"కు తొలి షీల్డ్‌ను దాసరిగారి చేత షీల్డు అందుకున్నాను. మళ్లీ ఇపుడు చరణ్ కూడా దాసరి గారి చేతులమీదుగా అందుకోవడం విశేషంగా వుందన్నారు.
ఈ చిత్రం విజయం వెనుక టీమ్ వర్క్ ఎంతో వుందన్నారు. వారందరినీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అనంతరం హీరో రామ్ చరణ్ తేజ మాట్లాడుతూ.. అశ్వనీదత్, పూరీ జగన్నాథ్ చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేశారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ నన్ను ఎంతగానే అభినందించారు. ముఖ్యంగా మా తాతగారు (వెంకట్రావు) నీ సినిమా చూసే వెళతాను అంటూవుండేవారు. ఆయన అనారోగ్యంలో వుండి కూడా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి బాగా చేశావురా.. నాకు చాలా తృప్తిగా ఉందంటూ చెప్పారు. ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని రామ్ అన్నాడు.