1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరంజీవే అలా చేయలేకపోయాడు: దాసరి

దాసరి నారాయణరావు చిరు 'చిరుత' చరణ్‌ వంద రోజులు
WD PhotoWD
చిరురాజకీయాల్లోకి రాకుండా వెనుక నుంచి దాసరి నారాయణరావు కొన్ని పనులు చేయిస్తున్నారని పలువురు పలు రకాలుగా అనుకున్న విషయంలో వాస్తవం లేదని తెలుస్తోంది. జనవరి 30న 'చిరుత' వందరోజుల వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

మీడియాను ఆహ్వానించకుండా స్వంత ఫంక్షన్‌లా ఆ కార్యక్రమం జరిగింది. 40 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా శిల్పకళావేదికలో వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. చరణ్‌కి చిరుత ఓపెనింగ్ ఓ పండుగ.

రిలీజ్ మరో పండుగ. వంద రోజులు అన్నింటికీ మించిన పండుగ. చరణ్ బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే.. చిరంజీవి తన మొదటి సినిమాలో కూడా ఇలా డాన్స్ చేయలేదు. ఇలా ఫైట్స్ చేయలేదు. ఓపెనింగ్స్‌లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. కలెక్షన్‌ల రికార్డు సృష్టించాడు.

తొలి చిత్రం మీ నాన్న ఇమేజ్ బాగా తోడయింది. రెండో చిత్రం మాత్రం నీకు నువ్వుగా ప్రూవ్ చేసుకోవాలి. తొలి చిత్రం షీల్డ్ అందుకోవడం గొప్ప అనుభూతి. 34 ఏళ్ల నాడు 'తాతా మనవడు' చిత్రానికి తొలి షీల్డు అందుకున్నాను. ఆ రాత్రంతా ఎన్ని గంటలు దాన్ని అలా చూస్తూనే ఉన్నానో నాకు గుర్తుంది.

ఇక చిరు కొడుకుతో సినిమా తీయాలంటే ఏ దర్శకుడికైనా ఛాలెంజ్. దానిలో పూరీ సక్సెస్ అయ్యాడు. ఇక అశ్వినీదత్ గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు.
About Writer
Hanumantha Reddy