1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నాగబాబుకు సెంటిమెంట్ అట...!

సర్కార్ హీరో నాగబాబు ఎగ్స్‌క్యూటివ్ నిర్మాత రామసత్యనారాయణ
చిత్ర సీమలో ప్రతీది సెంటిమెంటే... సినిమా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు, షూటింగ్‌లు జరపాలన్నా అన్నీ ముహూర్తాలు చూడాల్సిందే. ఏ హీరో సినిమా ఓపెనింగ్ అయినా ఆ సినిమా హీరో తప్పని సరిగా హాజరుకావలసిందే. ఒక వేళ ఊరిలో లేకపోతే వేరే విషయం.

కానీ తను ప్రధాన పాత్ర పోషిస్తున్న సర్కార్ అనే సినిమా ప్రారంభోత్సవానికి నాగబాబు హాజరు కాలేదు. సర్కార్ అంటే ఇదేదో హిందీ సినిమా అనుకునేరు.. అచ్చమైన తెలుగు సినిమా. శుక్రవారం ఆ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన వస్తాడేమోనని మీడియా ఎంతో సేపు ఎదురుచూసింది.

ఆఖరుకి ఆ సినిమాలో నటిస్తున్న సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ కూడా తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. 'అసలాయన లేకుండా మేమెందుకు ఓపెనింగ్‌కు అని' చిత్ర ఎగ్స్‌క్యూటివ్ నిర్మాత రామసత్యనారాయణను ప్రశ్నించింది. చేసేదిలేక... నాగబాబుగారు మహూర్తాలకు రారు. ఆయనకో సెంటిమెంట్ అంటూ వివరించారు.

ఇంతకీ అమితాబ్ నటించిన సర్కార్ చిత్రంలోని స్టిల్‌ను పోస్టర్లుగా వేసి తలకాయ ప్రాంతంలో నాగబాబుకు అతికించడం మరీ విడ్డూరంగా ఉందని ప్రారంభోత్సవానికి వచ్చిన వారంతా అనుకోవడం కొసమెరుపు. ఇంతకీ నిర్మాత సినిమా తీస్తాడో లేదో చూడాల్సిందే..?
About Writer
Hanumantha Reddy