అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటా: "చిరుత"నయుడు
|
హైదరాబాద్‌లోని చిరంజీవి, ఆయన బావమర్థి అల్లు అరవింద్ నివాసాలు, విమానాశ్రయాల్లో భారీ సంఖ్యలో విలేకరులను మొహరించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమైన ఈ వదంతులు రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత తీరాచూస్తే... ‘చిరుత’ ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి కూల్‌గా వచ్చారు. ఆయన వెంట మరో హీరో, బావ మరిది అల్లు అర్జున్ కూడా పక్కనే ఉన్నారు. మీరు పెళ్లి చేసుకున్నారట కదా? అని పాత్రికేయులు చరణ్‌తేజను ప్రశ్నించగా.. ఇవన్నీ వదంతులేనని ఆయన కొట్టిపారేశారు.
‘సినిమా రంగంలో ఉన్నవారిపై గాసిప్స్ రావడం సహజమే. నాపై ఇవి ఎందుకు పుట్టించారో తెలియదు. వీటిని విని నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం’ కదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా.. నేను దొంగచాటుగా పెళ్లిచేసుకోవాల్సిన అగత్యం లేదు. అమ్మానాన్నలు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకుంటానని స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలోనే మీపై ఇలాంటి వార్తలు రావడానికి కారణమేమిటని విలేఖరులు ప్రశ్నించగా... అల్లు అర్జున్ కల్పించుకుని ‘సాధారణంగా పెద్ద హీరోలపై ఇలాంటి గాసిప్స్ రావడం మీకు తెల్సిందే' కదా అని విలేకరులకు చురక అంటించారు.