జీవిత మంచి స్పీకర్: రాజశేఖర్
తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందనీ.. అది ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తాననీ నటుడు డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఒకవేళ తను ఏ పార్టీలోకైనా వెళ్లాల్సి వస్తే అది వారు గౌరవంగా భావిస్తేనే వెళతానని స్పష్టం చేశారు. తనకు స్కూలు దశ నుంచే సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉండేదన్నారు. మంచి పనులు చేసి మెప్పు పొందడమంటే తనకు చాలా ఇష్టమనీ, ఎన్టీఆర్ వల్లే రాజకీయాల గురించి తెలుసుకున్నాని అన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ... "ఎన్టీఆర్‌తో అనుబంధం జీవితంలో మరిచిపోలేనిది. చాలా విషయాలు నాతో చర్చించేవారు. రాజకీయాల్లోకి రమ్మని అడిగేవారు. ఇప్పుడే సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయని, తర్వాత వస్తానని చెప్పాను. దురుదృష్టవశాత్తూ... ఆ తర్వాత ఆయన్ను కలుసుకోలేకపోయాను.
సినిమాల్లో నటిస్తూ... 7,8 సంవత్సరాలు నేను చదివిన మెడిసిన్ అలోపతిలో పలు విషయాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో మళ్లీ నటించాను. ఇటీవల జరిగిన ఓ సంఘటలో భగవంతుడి దయవల్ల ఏమీ జరగకుండా బయటపడగలిగాను. అసలు రాజకీయమంటే ఇంత కష్టమైన పనా? అని కొన్నిసార్లు నాకే అనిపిస్తుండేది. జీవితకు నాకు ఈ విషయమై చర్చ జరిగింది.
'సినిమాల్లో ఉంటే చిన్న సంఘటన జరిగితే వెంటనే ప్రెస్ మీట్ పెడతాం. రాజకీయాల్లోకి వెళితే అటువంటివి రోజూ ఎదురుకావచ్చు. మీరు నటునిగా ఉంటే 8 గంటలు నిద్రపోయి మరుసటిరోజు ఉదయం గ్లామర్ గా కనబడాలి. అదే రాజకీయాల్లో ఉంటే ఈ రోజు తిరిగినట్లే రోజూ తిరగాలి. నిద్ర సరిగ్గా ఉండదు' అని జీవిత చెప్పింది. వెంటనే నేను ఇలా అన్నాను.. జన్మ అనేది ఒక్కసారే వస్తుంది. అందుకే నలుగురికీ సేవ చేయాలంటే ఈ జన్మలోనే సాధ్యం. ఇవాళ రాజకీయాల్లోకి రావాలనుంది. ఒకవేళ వస్తే... ఫలానా పార్టీలో ఎందుకు చేరానో, ఫలానా పార్టీలో ఎందుకు చేరలేదో వివరిస్తాను.
ఇటీవల జరిగిన సంఘటన పట్ల మీడియా చాలా సహకరించింది. ఇలాగే ప్రతి ఒక్కరి విషయంలో స్పందిస్తే బావుంటుంది. మీడియాలో నేను, జీవిత మాట్లాడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. చాలామంది ఇంటికి వచ్చి పలుకరిస్తున్నారు. జీవితను చూడగానే చాలా బాగా మాట్లాడారనీ, మంచి స్పీకర్ అనీ మరింత మెచ్చుకుంటున్నారు. జీవిత ఇంట్లో కూడా మంచి స్పీకరే.." అంటూ రాజశేఖర్ తెలిపారు.