1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో "చిరుత"

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రానికి శ్రీకారం
FileFILE
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభంకానుంది. యువ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను ప్రత్యేక కోణంలో చూపించనున్నారు.

ప్రేమ, యాక్షన్‌ సెంటిమెంట్‌లతో మిళితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు దర్శకుడు శాయశక్తులా కృషి చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సరసన నటించే అందాల భామను, ఇతర తారాగణాన్ని ఎంపిక చేయాల్సి వుంది. అలాగే ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చవచ్చని రాజధాని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
PNR