మ్ము.. మ్ము... ముమైత్ ఖాన్ ఓణి కట్టిందోచ్...
Publish: Wed, 6 Feb 2008 (13:09 IST)
Updated: Wed, 6 Feb 2008 (13:08 IST)
ముమైత్ ఖాన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాటెస్ట్‌గాళ్. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సెక్సీక్వీన్. "పోకిరి" చిత్రంలో ఐటం సాంగ్‌తో తెలుగు సినీ అరంగేట్రం చేసిన ఈ భామ... అనతి కాలంలోనే హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. మొన్న "మైసమ్మ ఐపీఎస్"తో ఆకట్టుకున్న ముమైత్ త్వరలో "మంగతాయారు"గా మురిపించనుంది. ఇందుకోసం ఆమె ఏం చేసిందో తెలుసా..! తనకు అచ్చొచ్చే అర బికినీలు పక్కన పెట్టి ఏకంగా అచ్చ తెనుగింటి ముద్దుగుమ్మలా ఓణి వేసింది. ఈ దుస్తుల్లో ముమైత్‌ను చూసిన చిత్ర యూనిట్ తమ కళ్లను తామే నమ్మలేక పోయారు. ఎట్టకేలకు తేరుకున్న వారు.. నిజంగా మన ముమైతే అని వాపోయారు. అంతేకదా.. మరి. ముమైత్ అంటేనే ఆరకొర దుస్తులతో దర్శనమిచ్చే భామగా ముద్రపడిన తర్వాత.. చీరకట్టినా, ఓణీ వేసినా మరొకటి కట్టినా వచ్చిన గుర్తింపు, పేరు పోతుందా?