అక్బర్ భార్య జోథాబాయి కాదు: చరిత్రకారులు
మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్, చాకులాంటి యువహీరో హృతిక్ రోషన్ జంటగా నటించిన 'జోథా అక్బర్' చిత్రం విడుదలకు మరో వారం రోజుల సమయముంది. జోథాబాయిగా ఐశ్వర్య నటన అద్భుతంగా ఉంటుందని దర్శకులు అశుతోష్ గోవారికర్ చెపుతున్నారు.
గోవారికర్ చెప్పినట్టు ఐశ్వర్య అద్భుత నటన సంగతేమోగానీ... చిత్రంలో చూపించనున్న జోథాబాయి అసలు అక్బర్ భార్య కానేకాదంటున్నారు చరిత్రకారులు. అసలు ఆ పేరుతో అక్బర్ భార్యగా ఎవరూ లేరనీ, అందుకు ఎటువంటి ఆధారాలు లేవనీ అంటున్నారు.
మొఘలుల కాలంలో ముగ్గురు చరిత్రకారులు నాటి పాలనను, పరిస్థితులను, అక్బర్ జీవితాన్ని రికార్డు చేశారు. ఆ రికార్డులలో ఎక్కడా జోథాబాయి అన్న పేరే లేదని ప్రస్తుత చరిత్రకారులు చెపుతున్నారు. మరి అశుతోష్ ఈ విషయంపై ఏమంటారో... 'చిత్రం అన్నాక కాసింత కళా పోషన ఉండాలి మరి...' అని మన రావుగోపాలరావుగారి స్టయిల్లో సెలవిస్తారేమో... చూద్దాం...