1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రామ్‌చరణ్‌తో కాజల్ కొత్త చిత్రం

రామ్‌ చరణ్ తేజ కాజల్ రాజమౌళి హ్యాపీడేస్ తమన్నా అనుష్క పౌరుడు
FileFILE
మెగాస్టార్ తనయుడు రామ్‌ చరణ్ తేజ హీరోగా నటించనున్న తదుపరి చిత్రంలో టీనేజీ అమ్మాయి కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ఆఫీసులో ఉన్న ఫోటోను చూసి కాజల్‌ను రాజమౌళినే ఎంపిక చేసినట్లు సమాచారం.

హ్యాపీడేస్ ఫేం తమన్నా మరి కొంత మంది హీరోయిన్‌ల పేర్లు పరిశీలించినప్పటికీ కాజల్ పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా, హిట్లు లేక పాట్లు పడుతున్న హీరోయిన్ అనుష్కకు రాజమౌళి చిత్రం విక్రమార్కుడుతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

దీంతో ఇటీవలే పౌరుడు చిత్రంలో సుమంత్‌తో జత కట్టిన కాజల్... రాజమౌళి చిత్రంలో నటించనుండటంతో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటుందని వినికిడి. ఫిబ్రవరి వారాంతంలోగా రాజస్థాన్‌లో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ప్రారంభం అవుతుందని సినీ వర్గాల భోగట్టా.
About Writer
Hanumantha Reddy