''ఆహా| ఎంత అందం'' అంటున్న ఆకాష్-నికోల్
|
అనంతరం రామోజీ ఫిలింసిటీలో జైలు ఎపిసోడ్, రెండు పాటలను చిత్రిస్తున్నాం. ఈ రోజుకు రెండు పాటలతో పాటు కొంత టాకీ పూర్తయింది. నా కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమిది. కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రం. నా తండ్రిగా రఘువరన్ నటిస్తున్నాడు. ఆయనో డాక్టర్. హీరోయిన్ తండ్రి డిఫిన్స్ మంత్రిగా ఆశిష్ విద్యార్ధి నటిస్తున్నారు. డాక్టరు కుమారుడికి డిఫిన్స్ మినిస్టర్ కుమార్తెకు జరిగే ప్రేమకథా చిత్రమిదని' తెలిపారు.
సంగీత దర్శకుడు జీవన్‌థామస్ మాట్లాడుతూ, 'యమ గోల మళ్ళీ మొదలైంది'. తర్వాత చేస్తున్న తెలుగు చిత్రమిది. మెలోడి, మాస్, పాప్ అన్ని రకాల బాణీలున్నాయి. మొత్తం ఎనిమిది పాటలు. రీరికార్డింగ్‌కు అవకాశమున్న కథ. టైటిల్ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఆలపించారు'. అని చెప్పారు. నృత్య దర్శకుడు కూల్ జయంత్ మాట్లాడుతూ, తెలుగులో 'ప్రేమదేశం' ద్వారా అందరికీ పరిచయం అయ్యాను. అందులో'కాలేజీ స్టైలే'... అనే పాట ఎంతో పేరు తెచ్చింది.
నాలుగు భాషల్లో పని చేశాను. ఇది నాకు 50వ చిత్రం. ఈ రోజు చిత్రించే పాటను చాలా రిచ్‌గా తీస్తున్నాం. అందుకు నిర్మాత అన్ని సౌకర్యాలు కల్పించారు. పాటరీత్యా ఆరుగురు రష్యన్, 22 మంది ముంబై డాన్సర్లు ఇందులో పాల్గొన్నారు. 'నవ వసంతం' తర్వాత ఆకాష్‌తో చేస్తున్న చిత్రమిదని' అన్నారు. 'ద్విభాషా చిత్రంలో నటించడం తనకిది మొదటిసారనీ, మెడికల్ విద్యార్ధిగా తాను నటిస్తున్నానని' నికోల్ చెప్పారు. 'ప్రేమ కథా చిత్రాలంటే తనకెంతో ఇష్టమనీ, ఇందులో కాలేజీ స్టూడెంట్‌పై వచ్చే పాట చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, సంగీతానికి ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్ అని' దర్శకుడు చెప్పారు. 'తదుపరి షెడ్యూల్‌ను ఈ నెలలోనే ఊటీలో చిత్రించనున్నట్లు' సమర్పకుడు తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో రామరాజు, బాబ్ ఆంథోని, రఘువరన్, ఐశ్వర్య, రేఖ, కర్ణాస్, ఆర్తీ, చిట్టిబాబు, మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: భారతీబాబు, పాటలు: భువన చంద్ర, కెమెరా: కిచ్చాస్.