1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

డా. పరమానందయాస్ స్టూడెంట్స్...

శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ ఎంపైర్ పతాకంపై రావిపల్లి రాంబాబు దర్శకత్వంలో జి.శ్రీనివాసరెడ్డి
శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ ఎంపైర్ పతాకంపై రావిపల్లి రాంబాబు దర్శకత్వంలో జి.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న "డా. పరమానందయాస్ స్టూడెంట్స్ గ్యాంగ్" (తోకలొక్కటే తక్కువ) అనే చిత్రం తొలి షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో చదువుకుందాం. అనుకునేవారి కంటే చదువుని కొందాం అనుకునే వారే ఎక్కువ శాతం ఉన్నారనే అంశాన్ని, చదువుకున్న ప్రాధాన్యతను చూపించబోతున్నాం. అలాగే సున్నితమైన భార్యాభర్తల అనుబంధాన్ని స్పృశిస్తూ.. పుణ్యస్త్రీ అన్న పదానికి కొత్త అర్ధం చెబుతున్న చిత్రమిది. నా తొలి చిత్రం 'వైఫ్' ఎలా జనాదరణ పొందిందో అంతకంటే ఎక్కువ జనామోదాన్ని ఈ చిత్రం పొందుతుందని అన్నారు.

నిర్మాత జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జనవరి 22 నుంచి ఈనెల ఐదు తేదీతో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈనెల 20 నుంచి మార్చి 10 తేదీ వరకు రాజమండ్రి, అరకు పరిసర ప్రాంతాలలో రెండు పాటలతో పాటు కొంత టాకీ పార్టు చిత్రీకరిస్తాం. అదే నెల చివరిలో మలేషియాలో జరిపే చివరి షెడ్యూల్లో షూటింగ్ పూర్తవుతుంది. మేలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని అన్నారు. చిత్ర కథానాయకుడు ఏఎన్నార్ ఎలియాస్ అమలాపురం నూకరాజుగా నటిస్తున్న గౌతంరాజు మాట్లాడుతూ, మనిషి జీవితంలో కలలా మిగిలేవి నిజంగా జరిగితే ఎలా ఉంటుందో దాన్ని ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాను.

దర్శకుడు ఓ సారి నా దగ్గరకు వచ్చి మీరు హీరోగా ఓ చిత్రాన్ని చేయాలనుకుంటున్నానని చెప్పగానే జోక్ చేశారనిపించింది. అది నేడు నిజమయింది. అక్కినేనిగారంటే ఎంతో ఇష్టం. ఆయనతో కలిసి కొన్ని చిత్రాలలో నటించాను. ఆయన చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభవడం సంతోషంగా ఉందన్నారు. మరో హీరో ఎన్టీఆర్ ఎలియాస్ నిమ్మగడ్డ తిమ్మారావు పాత్రధారి హరినాధ్ పొలిచర్ల మాట్లాడుతూ, ఇంతవరకూ యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రాలు చేసిన నేను ఈ సినిమాలో అందరినీ బాగా నవ్వించే చక్కటి పాత్రను పోషిస్తున్నాను. నటుడు అన్ని రకాల పాత్రలను చెయ్యాలనేది నా అభిమతం. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా చేయగలననే నిరూపించుకునే చిత్రమిదని' పేర్కొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: బొంబాయి భోలే, కెమెరా: మోహన్ చంద్, ఆర్ట్: పి.వి. రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రావిపల్లి రాంబాబు.
About Writer
PNR