"ప్రేమికుల రోజు" హీరో కునాల్ ఆత్మహత్య
|
సూర్యా మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మాతగా కదిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా సోనాలీ బింద్రే నటించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చగా ఈ పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. అలాగే హిందీలో 'దిల్ హై దిల్ మైన్' అనే చిత్రంతో బాలీవుడ్ వెండితెర అరంగేట్రం చేశారు.
అయితే.. కునాల్ గురువారం ఉదయం ఇంటి పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కునాల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. దీనిపై అంథేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రేమికుల రోజుకు మరో వారం రోజుల సమయం ఉండగా.. ఆ చిత్రం హీరో కునాల్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.