1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వరుణ్, తమన్నాలు జంటగా కొత్త చిత్రం

కోడిరామకృష్ణ ఎంఎస్ రాజు వరుణ్ సందేశ్ తమన్నా దిల్‌రాజు
FileFILE
తక్కువ బడ్జెట్ చిత్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది 'హ్యాపీడేస్' చిత్రం. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నాలు తమ నటనతో అందరినీ ఆకర్షించారు. కాగా, త్వరలో ఎంఎస్ రాజు సారథ్యంలో హిట్‌ఫెయిర్ జంట మళ్లీ కొత్త చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఈ చిత్రానికి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ఈ చిత్రంలో నవదీప్, సింధు మీనన్ మరో జంట పాత్రలను పోషించనున్నట్లు తెలిసింది. ఏమైతేనేం హ్యాపీడేస్ చిత్రం తాలూకు విజయం ప్రభావంతో వరుణ్, తమన్నాలకు మాత్రం ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి.

మరోవైపు వరుణ్ ఇప్పటికే దిల్‌రాజు సారథ్యంలో రూపొందుతున్న 'కొత్త బంగారు లోకం' చిత్రంలో నటిస్తుండగా.. రవి క్రిషన్ సారధ్యంలో తమన్నా 'నిన్న నేడు రేపు' చిత్రంలో నటిస్తోంది.
About Writer
Hanumantha Reddy