షూటింగ్ ప్రారంభమైన చిల్లరబ్యాచ్
|
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ప్రేమలో పడి బాధ్యతలను మరిచిన యువతీ, యువకులు సన్మార్గంలోకి నడిచేందుకు దారి తీసిన పరిస్థితులేమిటి వంటి అంశాలను కథలో ప్రధానంగా తెరకెక్కిస్తామని.. సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని మలుస్తామన్నారు.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ చేయనున్నామని అన్నారు. కథారచయిత శ్రీధర్‌సీపాన మాట్లాడుతూ, యువతరానికి కనువిప్పుకలిగే కథాంశమిదన్నారు. తాము ఈ చిత్రంలో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందని పొట్టి రాంబాబు, దేవా తెలిపారు. కెమెరా.. హనుమంత్ కె. ఠాగూర్, స్క్రీన్‌ప్లే దర్శకత్వ పర్యవేక్షణ.. ఎ.ఆర్.కె. సాయి, సంగీతం... రాజ్‍కిరణ్.