1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గిన్నీస్‌బుక్ రికార్డు కోసం ''అందమైన మనసులో''

ఓ పాటను గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేయనున్నట్లు
FileFILE
ఎస్‌.వి.బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న 'అందమైన మనసులో' చిత్రంలో ప్రత్యేకత సంతరించుకున్న ఓ పాటను గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్పీపట్నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పదిమంది సంగీత దర్శకులు కలిసి ఓ పాటను ఆలపించారు.

ఒకే చిత్రంలో.. అదీ ఒకే పాటలో ఇంత మంది ప్రముఖ సంగీత దర్శకుల స్వరాల వెల్లువను సమకూర్చడం గొప్ప ఫీట్ అని.. చాలా అరుదైన విషయంగా ఎస్‌.వి. బాబు చెబుతున్నారు. అంతేకాకా ఇప్పటివరకు చలనచిత్ర రంగంలో ఇలాంటి తరహాలో ఎవరూ చేయలేదని ఆయన తెలిపారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే.. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఓ పాత్రను పోషించినట్లు వెల్లడించారు.
About Writer
Hanumantha Reddy