"జీసెస్ క్రిస్ట్" చిత్రంలో నటించనున్న మల్లికా
|
అయితే తాజాగా జీసస్ క్రిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జీసస్ జీవితంలో 13 నుంచి 30 ఏళ్ల లోపు చోటు చేసుకున్న వివిధ పరిణామాలను, సంఘటనలను ఇందులో ప్రధానంగా చూపించనున్నాయి. ఇందులో భాగంగా జీసస్ భారత్ మీదుగా టిబెట్, పర్షియా, గ్రీస్, ఈజిప్టు దేశాల్లో పర్యటించినట్టు బైబిల్ చెపుతోంది. ఆయన భారత్‌లో కాశ్మీర్‌కు వచ్చినట్టు క్రైస్తవ భక్తులు పలువురు పేర్కొంటారు.
ఆ సమయంలో ఆయనకు అత్యంత భక్తురాలిగా వున్న సరస్వతి అనే పాత్రలో మల్లికా షెరాత్ నటించనున్నట్టు సమాచారం. దీనిపై షెరావత్ మాట్లాడుతూ అత్యంత భక్తిరస, చరిత్ర, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాత్రలు చేయాలని కోరిక. ఈ చిత్రంలో వీటిని పండించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని షెరావత్ ధీమా వ్యక్తం చేసింది.