1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆఖరి పాట చిత్రీకరణలో "బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్"

FileFILE
"బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్"లోని చివరి పాట చిత్రీకరణ గత కొద్దిరోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుపుకోంటోంది. నరేష్, భోజ్‌పురి నటి పాకీ హెగ్డేతో సహా పలువురి డ్యాన్సర్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. "నేను రెడీ అబ్బాయా.. నువ్వు రెడీనా.." అనే ఫోక్ సాంగ్‌ను ప్రేమ్ రక్షిత్ సారధ్యంలో తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పటివరకు 95 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన ప్యాచ్‌వర్క్‌ను ఈ నెలాఖరులో పూర్తిచేస్తామన్నారు. మార్చినాటికి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ముగించి ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు వివరించారు. కథకు కృష్ణభగవాన్ వెన్నుముకలాంటి వాడనీ, నరేష్ తన కామెడీ విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలిపారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి