"అమ్మ చెప్పింది" భామకు 8న పెళ్లి
|
తన వివాహం పట్ల శ్రేయా రెడ్డి మాట్లాడుతూ పెళ్లి అనంతరం చిత్రాల్లో నటిస్తానని చెప్పింది. "వేసవి", 'పొగరు' చిత్రాల్లో మాదిరిగా మంచి పాత్రలు లభించిన పక్షంలో తప్పకుండా నటించేందుకు సిద్ధంగా వున్నట్టు ఆమె వివరించింది. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు సినిమాలకు దూరంగా వుంటారు. అయితే.. శ్రేయారెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా తన సినీ కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ నిర్ణయంతో ఆమె అందాల భామలు రమ్యకృష్ణ, మాళవిక, జ్యోతిర్మయి వంటి వారి సరసన చేరింది. వీరు వివాహం తర్వాత చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలో ఓ ఇంటికి కోడలు కానున్న శ్రేయారెడ్డికి వివాహానంతరం కూడా మంచి చిత్రాల్లో నటించేందుకు ఆవకాశాలు రావాలని, ఆమె వివాహ జీవితం 'మూడు పువ్వులు ఆరు కాయలు'గా సాగాలని మనం కూడా కోరుకుందాం.!