''ఐటం సాంగ్''లో నర్తించనున్న ''బాపు బొమ్మ''
|
లోగడ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి "తోడు దొంగలు" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. గతంలో 'మహా మహా...' అంటూ సాగే పాప్ తరహా పాటలో ఛార్మీ చిందులువేసి యువతను 'మంత్ర'ముగ్ధులను చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా ఛార్మీ 'సుందరాకాండ' చిత్రం తర్వాత వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'చింతకాయల రవి' చిత్రంలో ఛార్మీ హీరోయిన్‌గా ఎంపికైంది.
హిందీ భాషలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యలు కలసి చేసిన కజరారే.. కజరారే అనే పాటను తెలుగులో జగపతిబాబు, తరుణ్, ఛార్మీలపై వచ్చే నెల ఆరో తేదీ నుంచి చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సినిమా సెట్ వేశారు.