1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"సల్లుబాబా" సరసన ఐటంగర్ల్‌గా కైఫ్

విక్టరీ వెంకటేష్ చిత్రం
FileFILE
విక్టరీ వెంకటేష్ చిత్రం "మల్లీశ్వరి" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ భామ ఖత్రినాకైఫ్. బాలీవుడ్‌లో అవకాశాలు అంతంతమాత్రంగా వుండటంతో ఐటంసాంగ్‌లపై దృష్టి సారించింది. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్‌ అయిన "పోకిరి" చిత్రాన్ని హిందీలో రిమేక్ చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఖత్రినాకైఫ్ ఐటంసాంగ్‌లో నర్తించనుంది. ముమైత్ ఖాన్‌పై చిత్రీకరించిన పాటను ఖత్రినాకైఫ్‌తో తీయనున్నారు.

"వాంటెండ్ డెడ్ అండ్ అలైవ్" అనే పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో "సల్లుబాబా" (సల్మాన్ ఖాన్) టైటిల్ రోల్‌ పోషిస్తున్నారు. ఐటం సాంగ్‌లో నటించేందుకు కైఫ్ అంగీకరించిందని త్వరలోనే చెన్నైలో చిత్రం షూటింగ్ ఆరంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. ఇదిలావుండగా 'ఇప్పటికింకా నాయవస్సు నిండా పదహారే' అనే పాట ముమైత్ ఖాన్‌ను తెలుగు వెండితెరపై మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా.. హీరోయిన్‌ రేంజ్‌కు తీసుకెళ్లిన విషయం తెల్సిందే.
About Writer
PNR