విజయ్-కౌశ హీరోహీరోయిన్లుగా "భగవంతుడు"
యశ్వంత్ ప్రొడక్షన్ పతాకంపై విజయ్-కౌశ హీరోహీరోయిన్లుగా "భగవంతుడు" అనే చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా రెండో షెడ్యూల్‌లో హీరో విజయ్, హీరోయిన్ కౌశ, కృష్ణభగవాన్, చిన్నా, హరిప్రసాద్ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సంగీత దర్శకుడు లలిత్ సురేష్ సారథ్యంలో పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని దర్శకుడు తెలిపారు.
ఈ చిత్రం తమ బేనర్‌కు మంచి పేరు తెస్తుందని నిర్మాత టివి.నరసింహా రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు. ఈనెల 20వ తేదీ నుంచి వైజాగ్, అరకు, భీమిలి తదితర ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ చిత్రానికి మాటలు పీఎస్.రామచంద్రుడు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ్రీరంగం సతీష్ కుమార్.