1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

28న ముహూర్తం విడుదల

ముహూర్తం విడుదల హీరో  హీరోయిన్లు
WD PhotoWD
సీహార్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై అంతా కొత్తవారితో రూపొందిన 'ముహూర్తం' చిత్రం గత నెల 26న యూఎస్‌ఏలో విడుదలైంది. అక్కడ స్పందన చూశాక ఈ చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చేయాలని ఈ నెల 28న ముహూర్తం పెట్టామని చిత్ర దర్శకుడు రవి తెనాలి వెల్లడించారు.

శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హీరో హీరోయిన్లుగా ప్రవీణ్, కృష్ణస్మిత కొత్తవారైనా చక్కగా చేశారు. అంతా కొత్తవారు కావడంతో స్క్రిప్ట్ రడీ అయ్యాక ఆరు నెలలు రిహార్సల్స్ కూడా చేశాం. కథరీత్యా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రించామని తెలిపారు.

నిర్మాత తోట క్రాంతి కుమార్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఓ ప్రేమ కథ. ఈ చిత్రానికి రీరికార్డింగ్ హైలైట్. సాహిత్యం కూడా ఆకట్టుకునే ఉంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదలవుతుంది. అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకముందని' తెలిపారు.

సంగీతం, సాహిత్యం సమకూర్చిన గోపిరెడ్డి అనిల్ మాట్లాడుతూ, ఈ చిత్రం 1944 నాటి నేపథ్యంలో జరుగుతుంది. కథకు సంబంధించి అప్పటి పరికరాలు, వాతావరణాన్ని కలగజేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్ర సంగీతం ఆకట్టుకుంది. ఎందుకంటే దీని తర్వాత మూడు చిత్రాలు అవకాశాలు వచ్చాయని' చెప్పారు. 'ప్రవాసాంధ్రురాలైన తాను ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉందని' కృష్ణస్మిత చెప్పారు.

యూఎస్ఏ డల్లాస్‌లో రిలీజ్ చేసిన పంపిణీదారుడు కృష్ణబాబు మాట్లాడుతూ, ఇంతవరకు రాని పాయింట్‌తో చిత్రం రూపొందింది. స్వాతంత్ర్యం కోసం పోరాడి త్యాగాలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారినేపథ్యంలోనే ఈ చిత్రం రూపొందింది' అన్నారు.
About Writer
WD