జాకీచాన్ చేతుల మీదుగా.. దశావతారం ఆడియో
|
నిజంగానే జాకీచాన్ "దశావతారం" ఆడియోను ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం కమల్ హాసన్ మల్లిక సాయం తీసుకున్నారు. ఎందుకంటే.. జాకీ సరసన ఓ హాలీవుడ్ (ది మిథ్) చిత్రంలో మల్లిక నటిస్తున్న విషయం తెల్సిందే. అందువల్ల కమల్ ఆమె సాయం తీసుకుని జాకీని చెన్నైకు రప్పిస్తున్నారు. సో.. వచ్చే మార్చిలో జాకీచాన్ చేతుల మీదుగా దశావతారం ఆడియో విడుదలకానుంది. ఈ చిత్రంలో మల్లికతో పాటు ఆసిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హిమేష్ రేష్మాయి సంగీత బాణీలు సమకూర్చారు.