1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఏప్రిల్‌లో జూనియర్ ఎన్టీఆర్ "కంత్రీ"..!

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం
FileFILE
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం "కంత్రీ". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో శరవేగంగా జరుపుకుంటోంది. జూనియర్ సరసన హాన్సికా మోత్వాని, తనిషాలు నటిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న షూటింగ్ ఈనెల 29వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ హైదారాబాద్‌కు తిరిగిరానుంది. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.

అయితే చిత్రం మిగిలిన షూటింగ్, ఇతర కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఏప్రిల్ నెల 28వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అదే రోజున వివి.వినాయక్ దర్శకత్వం వహించే కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు కూడా ప్రాంరభమయ్యే అవకాశాలు వున్నాయి.
About Writer
PNR